నీతి ఆయోగ్ భేటీ..! తెలుగు రాష్ట్రాల కోసం ప్రత్యేక వ్యూహాలు!
Sat May 24, 2025 11:38 Politics
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) , రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు (శనివారం) ప్రగతి మైదానం భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి (NITI Aayog Governing Council Meeting) ఇరువురు సీఎంలు హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటల వరకు నీతి ఆయోగ్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను తెలంగాణ సీఎం రేవంత్ ఆవిష్కరించనుండగా.. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన సంస్కరణలు, జనాభా పెంపుదల తదితర అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
2018 తర్వాత తొలిసారిగా
ఇక.. 2018 తర్వాత తొలిసారిగా నీతిఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా నీతిఆయోగ్ పాలక మండలి భేటీలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదల్చుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై రాష్ట్రం తరఫున ప్రత్యేక నివేదికను సీఎం రేవంత్ సమర్పించనున్నారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్‌తో ముందుకు సాగుతున్న విధానాన్ని వివరించనున్నారు. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడం లక్ష్యంగా పెట్టకున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పనున్నారు. ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్‌తో పాటు ఆ రంగాల్లో మరింత ముందుకు పోయేందుకు ప్రజాప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలంగాణ సీఎం వివరించనున్నారు.
ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్‌లుగా మారుస్తూ మౌలిక వసతులు, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో యూనివర్సిటీల ఏర్పాటుపై తన ప్రసంగంలో సీఎం ప్రస్తావిస్తారు. సాగు రంగం అభివృద్ధికి చేసిన రుణమాఫీ, వరికి బోనస్, సంక్షేమంలో భాగంగా అందిస్తున్న సన్న బియ్యం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500కే సిలిండర్ సరఫరాలను వివరించనున్నారు. సామాజిక సాధికారితలో భాగంగా ఎస్సీ కులాల ఉప వర్గీకరణ, కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానించిన విషయాన్ని కూడా నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించనున్నారు.
ఏపీ సీఎం ప్రత్యేక ప్రజెంటేషన్
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇప్పటికే విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అదే తరహాలో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన సంస్కరణలు, జనాభా నిష్పత్తిలో వ్యత్యాసాల తగ్గింపు, జనాభా పెంపుదలపై, నదుల అనుసంధానం నీటి వినియోగంపై ఈ సమావేశంలో సీఎం ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఒక్కో సీఎంకు 7 నిముషాలు సమయాని నీతి ఆయోగ్ కేటాయించింది. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
సమావేశానికి ముందు
నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ ప్రారంభానికి ముందు సీఎంలు, గవర్నర్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ముచ్చటించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రారంభోపన్యాసం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!
ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...
విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?
ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!
అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!
సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #NITIAayog #TeluguStates #AndhraPradesh #Telangana #DevelopmentPlans #CentralMeeting
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.